
పెద్దశంకరంపేట, ఏప్రిల్20: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లి, భూర్గుపల్లి, చీలపల్లి, ఆరెపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ప్రారంభోత్సవం చేశారు. మండల పరిధిలోని కమలాపురం, బుజ్రాన్‌పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రాంరభించారు. పెద్దశంకరంపేటలో రూ.5 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. మండల పరిధిలో బుజ్రాన్పల్లిలో వైకుంఠధామాన్ని ప్రాంర భించారు.
టీఆర్ఎస్లో చేరికలు…
మండల పరిధిలోని మూసాపేట గ్రామానికి చెందిన వడ్ల శ్రీశైలం, సామ్రాట్, సార అశోక్‌లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీ దత్తు, వీణా సుభాశ్‌గౌడ్, స్వప్నరాజేశ్వర్, సర్పంచ్‌లు తదితరులున్నారు.
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
రైతులు కోసమే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మండలంలోని నందిగామలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు..రైతులకు ఇబ్బంది లేకుండా చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామ ని , గోదావరి జలాలతో హల్దీ వాగు కు జీవకళ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నిజాంపేట మండలంలో 19 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ సంపత్, మండల కో-ఆప్షన్ సభ్యు డు గౌస్, ఎంపీడీవో వెంకటలక్ష్మి, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ వెంకటేశం, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు స్వామి, ఉపర్పంచ్ రాజం, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, ఐకేపీ సీసీ మల్లేశం, పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్హూస్సేన్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్సింహులు, నగేశ్, రాజ్‌గోపాల్, గ్రామస్తులు ఉన్నారు.
-మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి