ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు ధరించాలని చెబుతారు ఎందుకు?
– సరిత, గోదావరిఖని
ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మన సమాజంలో స్థిరపడింది. అలంకరణలో భాగమని భావించినా, దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. గోరింటాకు మహిళల చేతులకూ, పాదాలకూ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇదేదో అలంకరణ కోసం తెచ్చిన ఆడంబరం కాదు. గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆషాఢ మాసంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మ క్రిములు వ్యాపిస్తూ ఉంటాయి. వానల రాకతో గాలిలో, నీటిలో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తేమలో ఉండే సూక్ష్మ క్రిముల ప్రభావం చేతులు ద్వారా, పాదాల ద్వారా చర్మ రంధ్రాలగుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది. అంతేకాదు, గోరింటాకు ఒత్తిడిని, వేడిని తగ్గిస్తుంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయా నికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుందని, తద్వారా గర్భాశయ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నది ఆయుర్వేదం.
…? శ్రీ