అన్నిటికీ అతీతం ఆధ్యాత్మికత
Spiritual | ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగం అవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం కారణంగా, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని వాడుతున్నారు. సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. అయితే, కొందరి వల్ల అనిశ్చిత స్థితి ఏర్పడుతున్నది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా, చాలామందికి అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం కలుగుతున్నాయి. ఈ కారణంగానే వారి మనసులో ఎన్నో సందేహాలు ఏర్పడుతున్నాయి.
మన మనసులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు దేవుణ్ని గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత అనిపించుకోదు. మానసికమైన ఆలోచనలన్నీ ఆధ్యాత్మికత కాదు. నాకు ఒక ఆధ్యాత్మికమైన చిటికెన వేలు ఉందని చెబితే ఎలా ఉంటుంది? వేలు ఎప్పుడూ భౌతికమైనదే. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును, ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలచుకోవచ్చు. అంతమాత్రాన అది ఆధ్యాత్మికం కాదు. అది భౌతికం మాత్రమే.
భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గం మాత్రమే. అదేవిధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికం కాలేవు. అవి జీవితంలో భిన్న కోణాలు. వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై, అది ఆధారపడి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగా, ఆధ్యాత్మికతకు సాధకంగా ఉపయోగించవచ్చు. కానీ, బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు.
మనం ఆధ్యాత్మికత అన్నప్పుడు భౌతికం కాని మరో కోణం గురించి మాట్లాడుతున్నాం. అది ఈ పరిధికి చెందినది కాదు. మానసిక ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే అది ఆధ్యాత్మికత కాదు. జనం ఆధ్యాత్మిక ప్రశాంతత గురించి మాట్లాడుతుంటారు. అటువంటిదేమీ లేదు. శాంతి అన్నది భౌతికమైనది, మానసికమైనది. మీరు శారీరకమైన దాన్ని, మానసికమైనదాన్ని కలత పెట్టవచ్చు. ఈ రెండూ కాని ఆధ్యాత్మికతను కలత పెట్టలేరు. అది శాంతిని కోరదు, దానికి శాంతి అవసరం కూడా లేదు. వీటన్నిటికీ అతీతమైన, అద్భుతమైన సాధనా మార్గం ఆధ్యాత్మికత.
– సద్గురు ఈశా ఫౌండేషన్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- devotional
- sadguru
- spiritual
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

