తిరుమల : జూలై నెల నుంచి సెప్టెంబర్ 30వ తేదీవరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాల (VIP break darshans ) రద్దు వివరాలను టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించారు.
అదేవిధంగా ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24న పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ ఉంటుందని వివరించారు. సెప్టెంబర్ 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, సెప్టెంబర్ 15 నుంచి 23వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.