తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ –19 మహమ్మారి వ్యాప్తి కట్టడికి నిలిపివేసిన సర్వదర్శనం (Sarva Darshan) ఆఫ్లైన్ల టోకెన్ల జారీని నిలిపివేసిన విషయం విధితమే. ఇటీవల కరోనా తగ్గుముఖం పడుతుండడంతో సర్వదర్శనం టోకెన్ల జారీని ఇవాళ్టి నుంచి పునరుద్ధరించనున్నది.
బుధవారానికి సంబంధించిన టోకెన్లను మంగళవారం ఉదయం 8 గంటలకు జారీ చేయనున్నది. ఇందు కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవింద రాజస్వామి సత్రాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.