తిరుమల : తిరుపతిలోని కౌంటర్లలో ఇవాళ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12 నాటికి దర్శన స్లాట్ లభిస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందు అనగా మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుపతిలోని ఆయా కౌంటర్లలో అందజేస్తామని వివరించారు.
ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించడం లేదని, భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కాగా నిన్న స్వామివారిని 60,790 మంది భక్తులు దర్శించుకోగా 35,106 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన వివిధ కానుకల రూపేణా హుండీ ఆదాయం 4.36 కోట్లు వచ్చిందని వివరించారు.