తిరుమల : సంక్రాంతి పండుగ సెలవుల ( Sankranti holidays ) ముగింపు సందర్భంగా తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శని, ఆదివారాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మాఢ వీధులు కిటకిటలాడాయి . తిరుమలలో ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 83,576 మంది భక్తులు దర్శించుకోగా 31,173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 4.07 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.