అమరావతి : తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం 81,340 మంది భక్తులు దర్శించుకోగా 44,874 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ.3.76 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 4.42 లక్షల లడ్డూను విక్రయించామని,3.31 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు.