పరిణామం
కాపవ్యుడు ఒక బోయవాడు. పారియాత్రాచలంలో కుటుంబంతో ఉంటుండేవాడు. తల్లిదండ్రులను భక్తిశ్రద్ధలతో చూసుకునేవాడు. అడవిలో ఉండే మునులకు కందమూలాలు, పండ్లు తదితర ఆహార పదార్థాలు సమకూర్చేవాడు.
కాపవ్యుడు ఒక బోయవాడు. పారియాత్రాచలంలో కుటుంబంతో ఉంటుండేవాడు. తల్లిదండ్రులను భక్తిశ్రద్ధలతో చూసుకునేవాడు. అడవిలో ఉండే మునులకు కందమూలాలు, పండ్లు తదితర ఆహార పదార్థాలు సమకూర్చేవాడు. విలువిద్యలో నేర్పరి. పైగా పరాక్రమవంతుడు. ఎంతటివారినైనా ఒంటిచేత్తో ఓడించగల సామర్థ్యం కాపవ్యుడి సొంతం. అతని సాహసాల గురించి కథలు కథలుగా చెప్పుకొనేవారు. అవి విని ఆ ప్రాంతాల్లో ఉండే దొంగలు ఒకరోజు కాపవ్యుడిని కలిశారు. అతణ్ని తమ జట్టుకు నాయకుడిగా ఉండమని వేడుకున్నారు. వారి కోరికను అంగీకరించడానికి అతను కొన్ని నిబంధనల్ని వారి ముందుంచాడు.
శిశువులు, మునులు, స్త్రీలను చంపకూడదు. అబలల్ని చెరపట్టి హింసించరాదు. గో బ్రాహ్మణులను సంకట పెట్టరాదు. భర్తను చంపి, స్త్రీలను వైధవ్యానికి గురిచేయరాదు… ఇలా తన నియమాల్ని కచ్చితంగా వారికి తెలియజేశాడు. వారంతా సరే అంటూ అతని నాయకత్వానికి అంగీకరించారు. కాలక్రమేణా వారి మనసు, ప్రవర్తన మారి సద్గుణవంతులు అయ్యారు. కాపవ్యుడు కూడా తనను తాను ఉద్ధరించుకున్నాడు. మహాభారతంలో భీష్ముడు చెప్పిన ఈ కథ.. పరిణామ క్రమం ద్వారా వ్యక్తిత్వ వికాసం మాత్రమే కాక, సామాజిక ఉద్ధరణ జరుగుతుందని నిరూపిస్తుంది.
…?టి.వి.ఫణీంద్రకుమార్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

