ఎవరైతే ఈ జీవితంలో తమ కండ్లను సత్యాన్ని దర్శించడానికి ఉపయోగించి, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటారో, వారికి స్వర్గంలో లభించే బహుమతి వర్ణనాతీతం. స్వర్గంలో దొరికే శాశ్వత సౌందర్యం, ఆకర్షణ అంతా, ఈ లోకపు కాలుష్యాన్ని దూరంగా ఉంచుకున్నందుకు దైవం ఇచ్చే ప్రతిఫలం. నిజానికి, స్వర్గంలో దైవాన్ని దర్శించగలగడం అనే గొప్ప భాగ్యమే అత్యంత విలువైనది.
మిత్రమా! మన రెండు కండ్లు మన జీవితాన్ని నడిపించే దీపాలు. వీటిని భౌతిక దృశ్యాల వైపు మాత్రమే కాక, ఆధ్యాత్మిక లోతులలోకి, అంతిమ సత్యం వైపు కూడా మరల్చాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం ఏ దృష్టితో జీవిస్తామో, అదే మన శాశ్వత గమ్యాన్ని నిర్ణయిస్తుంది.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076