సోదరా.. నేనున్నా!
ఇద్దరు తోడబుట్టిన సోదరులు ఉండేవారు. ఎవరి కాపురాలు వాళ్లవి. ఓ రోజు తమ్ముడు అతని అన్న ఇంటికి వచ్చి అవసరంగా డబ్బులు కావాలన్నాడు. అన్న మరో ఆలోచన లేకుండా తమ్ముడు అడిగిన మొత్తం ఇచ్చేశాడు.
ఇద్దరు తోడబుట్టిన సోదరులు ఉండేవారు. ఎవరి కాపురాలు వాళ్లవి. ఓ రోజు తమ్ముడు అతని అన్న ఇంటికి వచ్చి అవసరంగా డబ్బులు కావాలన్నాడు. అన్న మరో ఆలోచన లేకుండా తమ్ముడు అడిగిన మొత్తం ఇచ్చేశాడు. తమ్ముడు వెళ్లిపోగానే ఇంట్లోకి వచ్చి తీవ్ర దుఃఖంతో రోదించసాగాడు. అది గమనించిన అతని భార్య ‘ఇప్పుడు ఏడ్చి ఏం లాభం, డబ్బులిచ్చే ముందు కనీసం నన్ను సంప్రదించనైనా లేదు’ అని ఓదార్చే ప్రయత్నం చేసింది. ‘నేను ఏడుస్తున్నది డబ్బు ఇచ్చినందుకు కాదు.
నా తమ్ముడు నా దగ్గరికి వచ్చి చెప్పుకొనే వరకు తన కష్టాలను తెలుసుకోలేక పోయినందుకు’ అని విలపించసాగాడు. దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు బాగోగులను ఓ కంట కనిపెడుతూ ఉండాలన్నది ప్రవక్త బోధనల సారాంశం. ‘ఎవరైతే తన సోదరుడి కష్టాలు తీరుస్తాడో.. అతని కష్టాలను అల్లాహ్ తీరుస్తాడు. సోదరుడికి సాయం చేసినన్నాళ్లూ.. ఆ వ్యక్తికి దైవం కూడా సాయం చేస్తుంటాడు. సోదరులు పరస్పరం ఒకరి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే కాదు, ఒకరిలోని లోపాలను, బలహీనతలను, దురలవాట్లను దూరం చేయాలి. ఒకరినొకరు సంస్కరించుకోవాలి’ అని ప్రవక్త బోధ.
ఇద్దరు అన్నదమ్ముల మధ్య మనస్ఫర్ధలు వచ్చినప్పుడు ఒకరు ఒక మెట్టు దిగి సంబంధాలను మెరుగుపర్చడం పిరికితనం కాదు, అది మానవత్వానికి నిదర్శనం. ‘(మూసా) మేము నీ సోదరుని ద్వారా నీ చేతులకు బలాన్ని సమకూరుస్తాం. మేము మీ ఉభయులకు ఒక విశేషశక్తిని ప్రసాదిస్తాం’ అని అన్నదమ్ముల ఐక్యత గురించి ఖురాన్ వివరిస్తుంది. ముహమ్మద్ ప్రవక్త ప్రాణమిత్రుల్లో హజ్రత్ అలీ (ర) ఒకరు. అలీ (రజి) కుమారుడైన ముహమ్మద్ బిన్ హనఫీయా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ‘మీ నాన్న నీ తమ్ముళ్లిద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు.
కానీ, నీ పట్ల మాత్రం వివక్ష చూపుతున్నాడు’ అని అన్నదమ్ముల మధ్య గొడవపెట్టే ప్రయత్నం చేశాడు. అతని మాటలను తిప్పికొడుతూ ‘నా సోదరులు హాసన్, హుసైన్ (ర)- మా నాన్నకు రెండు చెంపల వంటివారు, నేను ఆయన చెయ్యి. తన రెండు చెంపలకు ఏ హానీ కలగకూడదని తన రెండు చేతులను అడ్డుగా పెట్టుకున్నారు. అంటే మేమంతా ఒకే దేహంలోని భాగాలం’ అన్న సమాధానంతో చెంప చెళ్లుమనిపించారు.
ప్రవక్త మూసా (అలైహిస్సలామ్) తన పెద్దన్న శ్రేయస్సు కోసం అల్లాహ్ను ప్రార్థించాడు. ‘ప్రభూ! నన్నూ, నా సోదరుణ్ని క్షమించు. మా ఇద్దరికీ నీ కారుణ్య ఛాయలో చోటివ్వు నా సోదరుడి ద్వారా నా చేతులను పటిష్ఠం చెయ్యి. అతనిని నా కార్యంలో నాకు సహాయపడేలా చెయ్యి. మేము నీ పరిశుద్ధతను అత్యధికంగా ప్రకటించేటందుకు, నిన్ను అమితంగా స్మరించేటందుకు అవకాశం కల్పించు’ అని వేడుకున్న ప్రవక్త మూసా (అలై) మాటలు అల్లాహ్కు ఎంతగానో నచ్చాయి. అందుకే వాటిని దివ్య ఖురాన్లో (20:25)లో పొందుపరిచారు. అన్నదమ్ముల ఐక్యత ఎంత విలువైనదో ఈ సందర్భం తెలియజేస్తుంది.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

