ఇస్లాం బోధ
నాన్న నీడ లేని పిల్లల్ని ఇస్లామిక్ పరిభాషలో ‘యతీమ్’ అని పిలుస్తారు. నాన్న అండ కరువైన పిల్లలను అత్యంత బలహీనులుగా ఖురాన్ పేర్కొన్నది. తండ్రి లేని అనాథ పిల్లల ఆస్తి హక్కు, వాళ్లను ఆదుకునే ఆదేశాలు ఖురాన్లో ఎన్నో పేర్కొని ఉన్నాయి. అనాథ పిల్లల తల నిమిరితే ఆ బాలుర తలలో ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని పుణ్యాలు లభిస్తాయని ప్రవక్త ఉద్బోధ. అనాథ పిల్లల ఆస్తిని కబళించడం అంటే కడుపులో అగ్నిని నింపుకోవడమేనని ఆయన హెచ్చరించారు. ఇక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతను పిల్లలు కర్తవ్యంగా భావించాలని సూచించారు. ‘అమ్మ స్వర్గమైతే.. ఆ స్వర్గానికి ముఖద్వారం నాన్న. స్వర్గంలోకి ప్రవేశం లభించాలంటే.. దానికి ముఖద్వారమైన తండ్రిని ఆదరించాల’ని ప్రవక్త (స) పేర్కొన్నారు.
…? ముహమ్మద్ ముజాహిద్, 96406 22076