Srisailam Temple | పరివార దేవతలకు ప్రత్యేక పూజలు
Special Puja's in srisailam temple | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలోని పరివార దేవతలకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉదయం కుమారస్వామి అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం

శ్రీశైలం : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలోని పరివార దేవతలకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉదయం కుమారస్వామి అభిషేకాలు, పూజలు చేశారు. సాయంత్రం ప్రదోషకాలంలో క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు చేశారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాన ఆలయంలో నందిమండపంలో కొలువైన శనగల బసవన్నకు శుద్ధోకాలు, ఫలోదకాలతో అభిషేకించి షోడషోపచార పూజలు చేశారు. నందీశ్వరునికి శనగలు నైవేద్యంగా సమర్పించారు. నిత్యకళారాధనలో భాగంగా మహబూబాద్‌కు చెందిన తాండవ కృష్ణ నృత్యాలయం చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి.
భక్తుల విరాళాలు

శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ పథకాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన నాగార్జున, జగన్మోహిని దేవి, కర్నూలుకు చెందిన సుబ్బరావు దంపతులు, ప్రకాశం జిల్లాకు చెందిన రాఘవులు ఆలయ అధికారులకు చెక్కు రూపంలో విరాళాన్ని అందించారు. దాతలకు ఉభయ దేవాలయాల్లో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

