అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు.ఇటీవల కాలంలో రోజు 70 వేల నుంచి 77 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా నిన్న శనివారం ఒక్కరోజే 87,759 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడంతో కంపార్టుమెంట్లు నిండిపోయి గోగర్భం, శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. శనివారం 42,043 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా హుండీకి రూ. 4.16 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వెల్లడించారు.