ఇంట్లో పూజించే శివలింగం ఏ పరిమాణంలో ఉండాలో తెలియజేయండి?
శివప్రసాద్, హైదరాబాద్ శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం. అంటే శివలింగంలో ఇటు అమ్మవారు, మహావిష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురూ కొలువు దీరి ఉంటారు.
మూడు శక్తుల సమ్మేళనం అయిన శివలింగాన్ని నిత్యం పూజించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. అయితే మన బొటన వేలు కంటే చిన్నదైన శివలింగాన్ని పూజించడం శ్రేష్ఠం. సాలిగ్రామ లింగాలు ఎంత చిన్నవి అయితే అంత మంచిది. నిత్యపూజ, ధూపదీప నైవేద్యాలు సక్రమంగా నెరవేర్చుతూ ఉండాలి. నిత్యం అభిషేకం చేయాలి. సాధ్యంకాని రోజుల్లో శివలింగం మునిగే వరకు నీరుపోసి ఉంచాలి.