తిరుమల : అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ భక్తుడు ( NRI Devotees ) శివ ప్రసాద్ ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10, 01,116 విరాళంగా ( Donation ) అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 20 కంపార్టుమెంట్లు నిండిపోయాయి . నిన్న స్వామివారిని 82,007 మంది భక్తులు దర్శించుకోగా 39,154 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.13 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.