ఇస్లామీయ చరిత్రలో ఎంతో పవిత్రత, ప్రాధాన్యం ఉన్న యౌమె ఆషూరా రోజునే హజ్రత్ ఇమామె హుసైన్ (రజి) అమరులయ్యారు. వందల సంవత్సరాల క్రితం న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పరివారమంతా ‘కర్బాలా’ మైదానంలో ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితంగా పోరాడింది. కర్బలా ఘటన మనకు త్యాగస్ఫూర్తి పాఠాన్ని నేర్పుతుంది. దుర్మార్గాలపై, దౌర్జన్యాలపై రాజీలేని పోరాటాలు చేయాలని తెలుపుతుంది. ఆనాటి ఘటనను తలుచుకుంటూ ముస్లింలు మొహర్రం జరుపుకొంటారు. ఇమామెహుసైన్ (రజి) త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటారు.