Kashi Vishwanath Temple | శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథుడు పది రూపాల్లో దర్శనమివ్వనున్నాడు. చాలాకాలం తర్వాత విశ్వనాథుడు ఈ అలంకరణ చేపట్టనుండడం ఇదే తొలిసారి. అయితే, ఈ సారి అధిక మాసం సందర్భంగా శ్రావణమాసం రెండు నెలలు ఉంటుంది. శ్రావణంలో ఎనిమిది సోమవారాలుంటాయి. జులై 4 నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. మరో వైపు ఆలయంలో హారతి తదితర టికెట్ల ధరలను భారీగా పెంచారు. ప్రసుతం హారతి టికెట్ రూ.500 ఉండనున్నది. సులభ దర్శానికి రూ.750, శ్రావణంలో అలంకార దర్శనానికి రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.