మనసు గెలిచిన పొరుగు ధర్మం
పొరుగువారిపై కరుణను పరమ ధర్మంగా భావించింది ఇస్లామిక్ జీవన విధానం. ఇస్లామిక్ పండితుడైన హసన్ అల్-బస్రీ జీవితంలో జరిగిన ఒక సంఘటన మానవతా శిఖరాలకు నిదర్శనం. ఒకసారి హసన్ అల్-బస్రీ తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టారు. ఆ సమయంలో, వేరే మతస్తుడైన అతని పొరుగువాడు ఇమామ్ను పరామర్శించడానికి వచ్చాడు.
- ఇస్లాం బోధ
పొరుగువారిపై కరుణను పరమ ధర్మంగా భావించింది ఇస్లామిక్ జీవన విధానం. ఇస్లామిక్ పండితుడైన హసన్ అల్-బస్రీ జీవితంలో జరిగిన ఒక సంఘటన మానవతా శిఖరాలకు నిదర్శనం. ఒకసారి హసన్ అల్-బస్రీ తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టారు. ఆ సమయంలో, వేరే మతస్తుడైన అతని పొరుగువాడు ఇమామ్ను పరామర్శించడానికి వచ్చాడు. గదిలోకి రాగానే, ‘ఓ ఇమామ్! ఇక్కడేదో దుర్వాసన వస్తున్నదే!’ అన్నాడు. ఇమామ్ సాత్వికంగా నవ్వి, ‘అది నా అనారోగ్యం వల్ల కావచ్చు’ అన్నాడు. కానీ పొరుగువాడు ‘ఇది కచ్చితంగా మరుగుదొడ్డి దుర్వాసనే. అల్లాహ్ సాక్షిగా నిజం చెప్పండి’ అని పట్టుబట్టాడు. ఇక తప్పదని ఇమామ్ మెల్లగా ‘గత కొన్ని నెలలుగా మీ ఇంటి మురుగునీరు మా గోడల గుండా ఇటువైపు వస్తున్నది.
నీకు ఇబ్బంది కలగకూడదని నేనే దాన్ని సరిచేయడానికి ప్రయత్నించాను, కానీ సాధ్యం కాలేదు’ అన్నాడు. నిజానికి, ఆ పొరుగువాని ఇంటి మురుగునీటి మార్గంలో తేడా వల్ల కొన్ని నెలలుగా ఆ మురుగంతా ఇమామ్ ఇంట్లోకి చేరుతున్నది. ఆ విషయం పొరుగువానికి తెలియదు. ‘మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు?’ అని పొరుగువాడు అడుగగా ఇమామ్ ‘ఆ మాట చెబితే, నీ మనసు ఎక్కడ నొచ్చుకుంటుందోనని ఆగాను’ అన్నాడు. ఆత్మగౌరవాన్ని గాయపరచని ఆ అపారమైన నైతిక విలువకు, ఆ పొరుగువాని హృదయం కదిలి, ఇమామ్ చూపిన అచంచలమైన సహనం, మానవత్వంలోనే అతను ఇస్లాం దివ్య కాంతిని దర్శించాడు. పొరుగువాని పట్ల నిర్లక్ష్యం వహించేవాడు విశ్వాసి కాదంటారు ప్రవర్త. ‘ఎవరైతే అల్లాహ్ను, అంతిమ తీర్పు దినాన్ని విశ్వసిస్తారో, వారు మాట్లాడితే శుభప్రదమైన మాటలైనా మాట్లాడాలి, లేదంటే మౌనంగానైనా ఉండాలి. అల్లాహ్పై నమ్మకమున్నవాడు పొరుగువాని పట్ల ఉదారంగా, అతిథుల పట్ల ఆదరణతో మెలగాలి’ అన్న వ్యాఖ్యలు పొరుగువారితో ఎలా మసులుకోవాలో స్పష్టం చేస్తాయి.
…? ముహమ్మద్ ముజాహిద్, 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

