Ganesh Chaturthi 2023 | ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నాలు తలెత్తకుండా ఉండాలంటే స్వామిని స్మరించుకోవాలి. విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు. అన్ని దేవుళ్ల కన్నా ముందు పూజలందుకొనే అర్హత ఉన్నవాడు. భాద్రపద చవితి నాడు గణపతి పుట్టినందుకు ఆ రోజే వినాయక చవితిగా ప్రసిద్ధి. ఈ రోజు నుంచి నవరాత్రులు స్వామి వారిని పూజించి భక్తులు ఆశీస్సులు పొందుతుంటారు. పూజ ఎలా చేయాలంటే.. ముందుగా సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి.
గణపతి మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, వత్తులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు, మూడు ఉద్ధరిణలు, ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, యజ్ఞోపవీతం
పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యం పరిచి, పూర్ణకుంభంలో కొత్త బియ్యం వేసి, వినాయకుడి విగ్రహం పెట్టి అలంకరించాలి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేత గడ్డి ఆకులు, పూలు, పండ్లతో పాలవెల్లి అలంకరించాలి. గొడుగు పెట్టాలి.
నేతితో చేసిన 12 రకాల వంటకాలు. వీలు కాకపోతే శక్తి మేరకు రకరకాల పిండి వంటలు చేయవచ్చు. ఉండ్రాళ్లు, పాయసం గణపతికి ఇష్టమైన నైవేద్యం.
ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార