తిరుమల : ఆపదమొక్కుల వాడు, ఆపద్భాంవుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. తిరుమలలో ( Tirumala ) అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలా తోరణం ( Silathoranam ) వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
ఆదివారం స్వామివారిని 86,091 వేల మంది భక్తులు దర్శించుకోగా 29,664 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుపతి కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్వహించిన వాహనసేవకు భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.