తిరుమల : వడ్డీకాసులవాడు తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వరస్వామికి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. గురువారం హైదరాబాద్ ( Hyderabad Devotee ) కు చెందిన కమల అనే భక్తురాలు స్వామివారికి దాదాపు రూ.25 లక్షలు విలువైన రెండు బంగారు పగడాల హారాలు( Coral Necklaces ) విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి హారాలను అందజేశారు.
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం


హైదరాబాద్ కు చెందిన కొడాలి మారుతి శేషతల్ప సాయి అనే భక్తుడు గురువారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. అదేవిధంగా అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ నల్లపాటి గిరిధర్ అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.