Vinayaka Chavithi | ఈ వినాయక చవితికి ఇలా డిఫరెంట్‌గా ఉండ్రాళ్లు చేసుకోండి
Ganesh Chaturthi | వినాయక చవితి ( Vinayaka Chavithi ) అనగానే గుర్తొచ్చేది.. ఉండ్రాళ్లే (మోదకం). బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన ప్రసాదమిది. వీటిని రకరకాలుగా తయారుచేసి నివేదిస్తారు. స్వామికి సమర్పించే నైవేద్యాన్ని అంతిమంగా తినేది మనమే కాబట్టి, నైవేద్యాల తయారీ మీద మన అభిరుచులు, అభిప్రాయాల ప్రభావమూ ఉండి తీరుతుంది. అసలే ఊబకాయాలు, అధిక రక్తపోట్లు రాజ్యమేలుతున్న కాలం. ఏదో ఓ ఆహార విధానాన్ని అనుసరించాల్సిందే. అలాంటి వారికోసం వినూత్నమైన మోదక్‌లను తయారు చేస్తున్నారు పాకశాస్త్ర నిపుణులు.
పిల్లలు ఇష్టపడేలా జెల్లీ, చాక్లెట్, స్వీట్, ఐస్‌క్రీమ్ మోదక్‌లు అందుబాటులోకి వచ్చాయి. వేగన్ డైట్ పాటించేవారి కోసమే వాల్నట్స్, బాదం, ఖర్జూరాలు, కొబ్బరి, బెల్లంతో చేసే డ్రైఫ్రూట్ మోదక్‌లు ఉన్నాయి. గ్లూటెన్ ఫ్రీ డైట్ ఫాలో అవుతున్న వారికోసం కేసర్ మోదక్, వాల్నట్-బెల్లం మోదక్, ఓట్స్-బెల్లం మోదక్ మిఠాయి దుకాణాల్లో లభిస్తున్నాయి. పాలు, ధాన్యం వాడకుండా కాజూ-కారమెల్, రోజ్-బటర్‌స్కాచ్, చాక్లెట్ మోదక్లనూ తయారు చేస్తున్నారు. కీటో డైట్ అనుసరించే వారి కోసం కేసర్ పిస్తా, బాదం పిస్తా, డార్క్ చాక్లెట్, ఆల్మండ్.. ఇలా రకరకాల మోదక్‌లు సిద్ధం. బీపీ, షుగర్ జాన్తానై అంటూ.. చక్కెర మిఠాయిలను ఇష్టపడేవారికోసం మోతీచూర్ మోదక్, కోవా మోదక్, ఓరియో మోదక్, న్యూటెల్లా చాక్లెట్ మోదక్, బాసిల్ గుల్ఖండ్ మోదక్, పనీర్ మోదక్.. తయార్. వినాయకుడు భక్త వత్సలుడు. ప్రసాదంలోని తీపి కంటే, మనసులోని భక్తే ముఖ్యమని అనుకుంటాడు.
Read More :
“గణపతికి కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? “
Ganesh Chaturthi 2022 | గణేశుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం?
పూరీ జగన్నాథుడిని గణపతి రూపంలో ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న కథ ఇదే..
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

