Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Cyclone Arnab | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడి ‘ఆర్నబ్’ తుపానుగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Cyclone Arnab | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడి ‘ఆర్నబ్’ తుపానుగా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో సుమారు 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ సహా తూర్పు, మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
మంగళవారం నాటికి అర్నబ్ తుపాను తీవ్ర తుపానుగా మారి, ఆ తర్వాత అతి తీవ్ర తుపాను స్థాయికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్-యానాం తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. అప్పుడప్పుడు గాలి వేగం 140 కిలోమీటర్లకు చేరవచ్చని తెలిపారు. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
మూడు రోజులు అత్యంత కీలకం
తుపాను నేపథ్యంలో ఈ మూడు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. తుపాను మరింత బలపడుతున్నందున ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఏపీ, యానాంలో భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ అంచనా వేసింది. అక్టోబర్ 29న కూడా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు వర్ష సూచన
తుపాను తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం తగ్గడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత బలహీనపడినా.. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ విస్తారమైన ప్రాంతాల్లో వర్షాలు కురిపించవచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం నుంచి మూడు, నాలుగు రోజుల పాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితులు ఉండొచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

