తిరుమల : ది చెన్నై షాపింగ్ మాల్ ( Chennai Shoping Mall ) అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటిని ( One Crore ) విరాళంగా అందించారు.ఈ మేరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.
అదేవిధంగా శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు పలువురు దాతలు రూ.60 లక్షలు విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన రేవతి విశ్వనాథ్ రూ.40 లక్షలు, హైదరాబాద్కు చెందిన భవేశ్ చౌదరి రూ.10,07,777 విరాళంగా అందించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పొనకల నాగేంద్ర రావు రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు దాతలు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.