తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranthi Festival ) సెలవులున్నప్పటికీ పండుగ దృష్ట్యా ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
నిన్న 73, 014 మంది భక్తులు దర్శించుకోగా 19,639 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 4.27 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
టీటీడీ చైర్మన్, ఈవో సంక్రాంతి శుభాకాంక్షలు
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు ( BR Naidu ) , కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీవారి భక్తులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ నాడు గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని వారు ఆకాంక్షించారు.ఆ దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి కటాక్షాలతో ఈ పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు.