శ్రీవారి ఆలయ మాఢ వీధుల్లో సీవీఎస్వో, అర్బన్ ఎస్పీ పరిశీలన
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల అర్బన్ ఎస్పీతో కలిసి తిరుమల చీఫ్ విజిలెన్స్ అధికారి మాఢ వీధులను పరిశీలించారు.
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల అర్బన్ ఎస్పీతో కలిసి తిరుమల చీఫ్ విజిలెన్స్ అధికారి మాఢ వీధులను పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి.
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కలిసి పరిశీలించారు. కరోనా వ్యాప్తి కారణంగా రెండేండ్లుగా బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఢ వీధుల్లో శ్రీవారి వాహన సేవలను నిలిపి వేశారు. మాఢ వీధుల పరిశీలన అనంతరం టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తొలి విడతగా పరిశీలన చేపట్టామని, మరిన్ని సార్లు పరిశీలన చేపట్టి కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. వీరి వెంట టీటీడీ ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, ఈఈ జగన్ మోహన్ రెడ్డి, తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, తదితర టీటీడీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

