తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలపై వైకుంఠ దివ్య దర్శనాలకు టొకెన్లు పొందిన భక్తులు క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. నిన్న స్వామివారిని74,800 మంది భక్తులు దర్శించుకోగా 17,406 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా స్వామివారి హుండీకి (Hundi) రూ. 3.44 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
భక్తుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకున్న టీటీడీ చైర్మన్
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ( BR Naidu) భక్తులతో కలసి భోజనం చేసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యత గురించి భక్తులతో అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాద భవనంలో వడ్డిస్తున్న అన్నప్రసాదల నాణ్యత, రుచి మెరుగుపడిందని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.