‘సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదం’టారు పెద్దలు. అయితే, సాధన చేసే క్రమంలో అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతాయి. సాధకులు మొదటగా అంతర్ దృష్టిని అలవర్చుకోవాలి. రెండో దశలో మనసులోని అరిషడ్వర్గాలను అధిగమించే ప్రయత్నం చేయాలి. అరిషడ్వర్గాలను జయించే కొద్దీ మనసు పవిత్రంగా మారుతుంటుంది. తర్వాతి దశలో విషయ వాసనలను త్యజించాలి. సంకుచిత భావాలను తొలగించుకొని విశాల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఈ విధంగా సాధకుడు తనను తాను అంచెలంచెలుగా సంస్కరించుకోవాలి. ఈ ప్రయత్నంలో వచ్చే అడ్డంకులకు, కష్టాలకు వెరవకుండా, వాటిని భగవంతుడు కల్పించిన అవకాశాలుగా భావించాలి. భగవంతుడి ఎరుక స్పష్టమైన రోజు సాధన సమున్నతంగా కొనసాగుతుంది.
శ్రీ