ఒకసారి ప్రభువు చుట్టూ శిష్యులు కూర్చొని ఉన్నారు. ప్రభువు మెల్లగా లేచి, ఓ చేత్తో పళ్లెం పట్టుకొని, మరో చేత్తో నీళ్ల లోటా తీసుకున్నారు. శిష్యుల్ని చేరి, మౌనంగా వారి ఒక్కొక్కరి పాదాలూ కడుగుతూ, నడుముకు చుట్టిన వస్త్రంతో తుడవసాగాడు. అందరూ ఆశ్చర్యంతో ప్రభూ ఏమిటిదీ అనీ ఒక్కసారిగా ఆయన పాదాలపై పడిపోయారు. ‘నేను మీకు చేస్తున్నట్టే, మీరు కూడా ఒకరికొకరు పరస్పరం ఇలానే చేసుకోవాలి’ అనే సందేశం ఇచ్చాడు. చేయవలసిందాన్ని కేవలం చెప్పకుండానే ముందుగానే చేసి చూపించాడు ప్రభువు. మనం మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడమే కాదు, ఇతరులనూ సేవించడం అవసరమని బోధించాడు. జగత్తుకు పాలకుడైన ప్రభువు.. తన అనుయాయుల పాదాలను కడిగి సేవాగుణం గొప్పదనాన్ని చాటిచెప్పాడు. ప్రజలను ఎలా సేవించాలో ప్రభుతకు బోధించాడు. ప్రజలను బిడ్డలుగా భావిస్తూ.. వారి అవసరాలను గుర్తెరిగి.. వాటిని నెరవేర్చడమే ప్రభుత్వం బాధ్యత.