వర్తమానం భవిష్యత్‌కు పునాది. యుక్తవయసులో చేసే సావాసాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అలవాట్లు పొరపాట్లుగా మారి జీవితాన్ని తీర్చిదిద్దుకోకుండా దెబ్బతీస్తాయి. బలం ఉంది కదా అని యవ్వనంలో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించి జీవితం చేజారిపోయాక పశ్చాత్తాపం చెంది ప్రయోజనం లేదు. ఇదే విషయాన్ని గీతాచార్యుడు హెచ్చరిక చేశాడు. ఆశయ సాధనకు క్రమశిక్షణను మించిన ఆయుధం లేదని పేర్కొన్నాడు.
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసుయుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా (6-17)సరైన ఆహార నియమాలు పాటించాలి. సరైన అలవాట్లు కలిగి ఉండాలి. ఆహార, వ్యవహారాల్లో మంచి, చెడులను గుర్తించిన వాడు దుఃఖం నుంచి దూరంగా ఉండగలుగుతాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక్కటే సరిపోదు,దానిని సాధించడానికి అహర్నిశలూ కృషి చేయాలి. ఆత్మసంయమ యోగంలో కృష్ణుడు చెప్పిన ఈ మాట సదా అనుసరణీయం.
…? విష్ణువర్ధన్