దైవాన్ని చూడలేకపోతేనేం..
ఒక ఊరిలో ఓ అంధ కళాకారుడు దారిన వెళ్తున్నాడు. ‘మక్కాలో ముహమ్మద్ అని పేరుగల వ్యక్తి ధర్మాన్ని బోధిస్తున్నాడట. మనుషులంతా ఒక్కటే, దేవుడొక్కడే అని ప్రచారం చేస్తున్నాడట’ అన్న మాటలు అతని చెవినపడ్డాయి. ‘ముహమ్మద్..’ ఈ పేరు చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాడు.
ఒక ఊరిలో ఓ అంధ కళాకారుడు దారిన వెళ్తున్నాడు. ‘మక్కాలో ముహమ్మద్ అని పేరుగల వ్యక్తి ధర్మాన్ని బోధిస్తున్నాడట. మనుషులంతా ఒక్కటే, దేవుడొక్కడే అని ప్రచారం చేస్తున్నాడట’ అన్న మాటలు అతని చెవినపడ్డాయి. ‘ముహమ్మద్..’ ఈ పేరు చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాడు. ఆయన్ను ప్రజలు సాదిక్ (సత్యసంధుడు), అమీన్(నిజాయతీపరుడు) అని పిలవడం కూడా తనకు గుర్తుంది. చిన్నప్పుడు ఎవరూ తన బాగోగులు పట్టించుకోకపోయినా.. ఆయన మాత్రం వచ్చి తన యోగక్షేమాలు అడిగి మరీ వెళ్తుండేవాడు. ఆ విషయాలన్నీ తలుచుకొని తనే ప్రవక్త (స) దగ్గరికి వెళ్లి కలవాలని అనుకున్నాడు. ఆయన ఎక్కడ ఉంటారో అందరినీ అడుగుతూ… ప్రవక్త (స) దర్బారుకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రవక్త తన సహచరులకు దైవం గురించి చెబుతున్నారు. ‘పర్వతాలకూ, సముద్రాలకూ, ఆకాశానికీ, భూమికీ, సూర్యచంద్రులకూ, నక్షత్రాలకూ, ఈ చరాచర సృష్టికి మూలం ఆ ఏకైక దైవం ఒక్కడే’ అని బోధిస్తున్నారు.
కానీ, అంధుడికి ఆ మాటలేం బోధపడలేదు. ఈ వింతలేవీ తను చూడలేదు. అవి ఎలా ఉంటాయో కూడా అతనికి తెలియదు. అప్పుడు ప్రవక్త (స) ‘అల్లాహ్ మనందరికీ మాట్లాడే శక్తినిచ్చాడు. వినికిడి శక్తి అనుగ్రహించిందీ ఆయనే. మనకు ప్రాణం పోసిందీ ఆయనే’ అని చెప్పసాగారు. అప్పుడు అంధుడు పక్కన ఉన్న ఓ వ్యక్తితో ‘అల్లాహ్ ఎలా ఉంటాడని’ ప్రశ్నించాడు. ‘అల్లాహ్కు భౌతిక రూపం లేదు. ఈ నేత్రాలతో ఆయన్ను చూడలేం’ అన్నాడు. ‘కండ్లున్నవాళ్లు కూడా ఆయన్ను చూసే భాగ్యం లేదన్నమాట. ఇక నాకు కండ్లు లేవన్న బాధ కూడా పోయింది’ అని లోలోపల మురిసిపోయాడు అంధుడు. ప్రవక్త (స) శిష్యుడిగా చేరి దైవసేవలో తరించాడు.
…?ముహమ్మద్ ముజాహిద్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Earth
- Muhammad
- Sky
- Sun and Moon
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

