BAN vs AUS: బంగ్లా బౌలర్‌తో మాటల ఘర్షణకు దిగిన ఆసీస్ బ్యాటర్.. వీడియో
BAN vs AUS: బంగ్లా బౌలర్ నహిద్ రాణా.. ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ మధ్య మాటల ఘర్షణ జరిగింది. తొలి వన్డేలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బౌన్సర్ కి క్యాచ్ అవుట్ అయిన ఇంగ్లిష్.. ఆవేశంలో బంగ్లా బౌలర్‌ను ఏదో తిట్టేశాడు. దీంతో మైదానంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
ఢాకా: ఆస్ట్రేలియాకు తొలి వన్డే(BAN vs AUS)లో బంగ్లాదేశ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసింది. అయితే పేస్ బౌలర్ నహీద్ రాణా.. తన బౌలింగ్‌తో దడపుట్టించాడు. రాణా స్పీడ్‌కు కంగారులు చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉన్న జోష్ ఇంగ్లిష్ వికెట్‌ను రాణానే తీసుకున్నాడు. ఇంగ్లిష్ ఔటైన సమయంలో కాస్త ఉత్కంఠ నెలకొన్నది. బౌలర్ రాణా, బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఈ ఘటన చేజింగ్ చేస్తున్న సమయంలో 11వ ఓవర్లో జరిగింది. రాణా వేసిన బౌన్సర్.. ఇంగ్లిష్ బ్యాట్‌కు తగిలి.. కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆ వికెట్‌ను రాణా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంగ్లిష్ కాస్త అసహనానికి లోనయ్యాడు. ఆవేశంలో పేస్ బౌలర్‌తో వాగ్వాదానికి దిగాడు.
బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మీర్జా జోక్యం చేసుకుని ఆస్ట్రేలియా బ్యాటర్‌ను కూల్ చేశాడు. ఆ దశలో ఆస్ట్రేలియా 51 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్‌లో ఈ వికెట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. రాణా, ఇంగ్లిష్ మాటల ఘర్షణకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
A heated moment between Josh Inglis and Nahid Rana. 🔥
pic.twitter.com/ZVX9pqWNYg— Sheri. (@CallMeSheri1_) June 9, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

