Bharathi raja | ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన తరుణంలో, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం 9:30 గంటలకు తాను ప్రకటించాల్సిన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తాజాగా వాయిదా వేస్తున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ విషయాన్ని లారెన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ, భారతీరాజా గారి మరణం తనకు వ్యక్తిగతంగా ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగానికి ఆయన చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా, ఆయనపై ఉన్న గౌరవార్థం తన ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే, వాయిదా పడిన ఆ విశేషాన్ని శుక్రవారం ఉదయం 10:00 గంటలకు తెలియజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే రాఘవ లారెన్స్ చేయబోయే ఆ కీలక ప్రకటన రాజకీయ రంగ ప్రవేశం గురించేనా అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఆయన ‘విజయ్ టీవీకే’ (Vijay TVK) పార్టీ తరఫున తిరుచ్చి నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం ఆయన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇస్తారా లేదా మరేదైనా సర్ప్రైజ్ ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Hi everyone,
I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.
The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr
— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026