తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 6 కంపార్ట్మెంట్లలో భక్తులు. వేచి ఉన్నారని తెలిపారు. నిన్నశ్రీవారిని 75,078 మంది భక్తులు దర్శించుకోగా , 34,648 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా రేపు టీటీడీ పాలక మండలి ఎక్స్అఫిషియే సభ్యుడిగా ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణం చేయనున్నారు.