భోపాల్: దేవతా విగ్రహాన్ని పగులగొట్టాడని ఆరోపిస్తూ కొందరు యువకులు ఒక వృద్ధుడిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నీమచ్‌లోని మూల్‌చంద్ మార్గ్‌లో శుక్రవారం రాత్రి 7 గంటలకు కొందరు యువకులు కమల్ దాస్ అనే వృద్ధుడి జుట్టుపట్టుకొని ఈడ్చి కర్రతో కొట్టారు. దేవతా విగ్రహాన్ని పగులగొట్టాడని ఆరోపిస్తూ అతడిపై దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోపై స్పందించిన పోలీసులు కమల్ దాస్‌పై దాడి చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ వృద్ధుడి మానసిక పరిస్థితి సరిగా లేదని, కొన్నేండ్లుగా శ్మశాన వాటికలో ఉంటున్నాడని తెలిపారు.