హైదరాబాద్: హైదరాబాద్‌లో (Hyderabad) మరో హత్య చోటుచేసుకున్నది. ప్రమ విషయంలో ఇంజినీరింగ్ విద్యార్థిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ (Balapur) పరిధిలో జరిగింది. ఖమ్మం జల్లాకు చెందిన శాంతయ్య, అనితకు ప్రశాంత్ ఏకైక కుమారుడు. తల్లితో కలిసి బాలాపూర్‌లో నివాసం ఉంటూ ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద మండి 37 అరేబియన్ హోటల్ వద్ద ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు యువకులు సిగరెట్లు తాగుతున్నారు.
ఈక్రమంలో స్నేహితులకు, ప్రశాంత్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు యువకులు ప్రశాంత్‌పై దాడి చేశారు. వారిలో ఓ యువకుడు తన వద్ద ఉన్న కత్తితో ప్రశాంత్ కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్.. రక్తపు మడుగులో పడిపోగానే ముగ్గురు బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అతడు అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యచేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో అతని తల్లి గుండెలవిసేలా రోదించడం అక్కడివారిని కలచివేసింది.