Nalgonda | యువతి వెంటపడుతున్నాడని కొట్టి చంపారు..!
Nalgonda | నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. గుర్రంపోడు మండలం కొప్పోలులో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.
Nalgonda | నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. గుర్రంపోడు మండలం కొప్పోలులో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కట్టంగూరు మండలం దుగినేపల్లికి చెందిన బొడ్డు సంతోష్ అనే యువకుడు నల్గొండ్‌లో ఇంటర్ చదివాడు. తనతో పాటు చదివిన యువతితో ప్రేమ వ్యవహారం సాగింది. ఈ వివాదంలో ఇరువర్గాలు తల్లిదండ్రులు గ్రామంలో గతంలో పంచాయతీ నిర్వహించారు. పంచాయితీ పెద్దలు ఒకరి జోలికి మరొకరు రావొద్దని తీర్మానించారు. ఆ తర్వాత యువకుడు తన తల్లిదండ్రులతో పాటు సూరత్‌కు కల్లు గీత వృత్తి నిమిత్తం వలస వెళ్లాడు. సంతోషం గురువారం చండూరు మండలంలో తన బంధువుల ఇంటికి పండుగ కోసం వచ్చాడు.
ఈ క్రమంలోనే యువతితో ఫోన్లో మాట్లాడాడు. ఆమె ఇంటికి రమ్మని పిలువగా.. కొప్పోలులోని ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన యువతి నాయనమ్మ ఇంటికి గడియ వేసి కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. దాంతో వారు ఇంటికి చేరుకొని ఆగ్రహావేశాలకు గురై యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దెబ్బలకు తాళలేక యువకుడు ప్రాణాలు వదిలాడు. యువతి నాయనమ్మ రాములమ్మ మాత్రం తానే యువకుడిని రోకలిబండతో కొడితే చనిపోయినట్లుగా పోలీసులకు తెలిపింది. అయితే, యువతి కుటుంబీకులు మాట్లాడుకుందాం రమ్మని నమ్మించి.. ఇంటికి పిలిచి హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

