Road accident : మూడు రోజుల్లో పెళ్లి అంతలోనే విషాదం..
Road accident | అనంతపురం మండలం కదిరి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

అమరావతి : అనంతపురం మండలం కదిరి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలివి.. కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామానికి మహేశ్ (26)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ 27న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బంధువులకు పెండ్లి పత్రికలు పంచేందుకు మహేశ్ ఈ ఉదయం బైక్పై వెళ్తుండగా ఎరుకులవాండ్లపల్లి శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

