కుక్క పిల్లను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

అమరావతి : తల్లి తనకు కుక్క పిల్లను కొనివ్వలేదన్న మనస్తాపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. షణ్ముక వంశీ (16) అనే యువకుడు ఇటీవల ఆన్లైన్లో రూ. 30 వేల విలువైన ఓ కుక్క పిల్లను చూసి కొనివ్వాలని తల్లిని కోరాడు. కొన్నిరోజుల తర్వాత కొందామని తల్లి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం తల్లి ఇంట్లో లేని సమయంలో గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుమారుడి మృతితో తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

