హైదరాబాద్ : నగరంలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి విక్రయిస్తున్న మహిళా టెకీ(24)ని బోయిన్పల్లి పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. మహిళను మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్ మదన్ మనేకర్ భార్య మన్సిగా గుర్తించారు. మదన్ గత 15 రోజులుగా పరారీలో ఉన్నాడు.
మహిళ తన అనుచరుడిని కలుసుకునేందుకు కొంపల్లి వచ్చిందనే సమాచారంతో పోలీసులు మాటువేశారు. మార్చి 12న ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ విక్రయిస్తుండగా మన్సి, ఆమె భర్త మదన్ మరో ఇద్దరు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఏపీలోని విశాఖపట్నం ఏజెన్సీ అరకు నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌లో టెకీలకు విక్రయిస్తున్నారని పోలీసులు నిగ్గుతేల్చారు.