భోపాల్ : మరదలిపై కన్నేసి రెండేండ్లుగా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా వేరొక వ్యక్తితో జరిగిన నిశ్చితార్ధాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించిన మేనబావపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్‌లోని మంగల్వారా ప్రాంతానికి చెందిన వ్యక్తి గత రెండేండ్లుగా ప్రేమ పేరుతో మేన మరదలి వెంటపడుతూ లైంగికంగా వేధిస్తున్నాడు.
కొద్దినెలల కిందట యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్ధం జరిగింది. దీంతో ఎంగేజ్‌మెంట్‌ను చెడగొట్టాలనే ఉద్దేశంతో నిందితుడు యువతి కాబోయే భర్త ఫోన్‌కు ఆమె వ్యక్తిగత ఫోటోలు, కాల్ రికార్డింగ్‌లను పంపాడు. మేనబావ తీరుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై లైంగిక వేధింపుల కేసును నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.