న్యూఢిల్లీ : ఈ ఏడాది దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Online Scam) విచ్చలవిడిగా పెరిగాయి. రోజుకో స్కీమ్‌తో స్కామ్‌లకు సైబర్ నేరగాళ్లు తెరలేపుతున్నారు. ఇక లేటెస్ట్గా గురుగ్రామ్‌కు చెందిన మహిళ ఆన్లైన్లో విస్కీ ఆర్డర్ చేస్తూ రూ. 33,000 పోగొట్టుకున్నారు. విస్కీ బాటిల్ కోసం మహిళ (32) గూగుల్‌లో సెర్చ్ చేయగా ఆల్కహాల్ డోర్ డెలివరీ చేస్తామని వెల్లడించే ఓ ఫోన్ నెంబర్ ఆమె కంటపడింది. ఆ నెంబర్‌కు కాల్ చేసి గ్లెన్‌ఫిడిక్ బాటిల్‌ను రూ. 3000కు యూపీఐ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసింది.
డెలివరీ కోసం అదనంగా చెల్లించాలని కాలర్ కోరాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తన ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసింది. ఆపై స్కామర్లు రూ. 5 చెల్లిస్తే యూపీఐ లావాదేవీని రిఫండ్ చేస్తామని నమ్మబలికారు. వారు చెప్పినట్టే రూ. 5 ట్రాన్స్ఫర్ చేయగా, వెంటనే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 29,986 డెబిట్ అయినట్టు నోటిఫికేషన్ రావడంతో బ్యాంక్‌ను సంప్రదించి ఖాతాను బ్లాక్ చేయించింది.
ఎలాంటి అనుమానిత యాప్స్ డౌన్లోడ్ చేయకున్నా స్కామర్లు మహిళ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు దండుకున్నారు. స్కామర్లు పంపిన క్యూఆర్ కోడ్‌తో రూ. 5 చెల్లించడం ద్వారానే వారు మోసానికి పాల్పడిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ నెంబర్‌ను గుర్తించిన పోలీసులు బ్యాంక్ నుంచి లావాదేవీల గురించి ఆరా తీసి నిందితుడి లొకేషన్‌ను భరత్పూర్గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి