Man buried in bedroom | వారం రోజులుగా కనపడని యువకుడు.. అతడిని ప్రియురాలు ఏం చేసిందంటే..
Man buried in bedroom | ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లిన ఒక యువకుడు. వారం రోజులుగా తిరిగి రాలేదు. అతనెక్కడున్నాడో ఆచూకీ తెలియలేదు. అతని కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేయగా.. అతడు చివరగా తన ప్రియురాలు ఇంటికి వెళ్లినట్లు

ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లిన ఒక యువకుడు. వారం రోజులుగా తిరిగి రాలేదు. అతనెక్కడున్నాడో ఆచూకీ తెలియలేదు. అతని కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేయగా.. అతడు చివరగా తన ప్రియురాలు ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ఆమెపై అనుమానంతో పోలీసులు విచారణ చేయగా.. భయంకరమైన నిజం బయటపడింది. ఆ యువకుడిని ఆమె హత్య చేసి తన బెడ్ రూంలో పాతిపెట్టింది. ఈ సంఘటన బీహార్లోని పూర్ణియా జిల్లాలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. పూర్ణియా జిల్లాకు చెందిన సంపత్ భూముల లావాదేవీల వ్యాపారం చేసేవాడు. అతడికి ఆశా దేవి అనే ప్రియురాలు ఉంది. ఆమెకు ఇంతకుముందే భర్త కూడా ఉన్నాడు. వారిద్దరి మధ్య ఉన్నది వివాహేతర సంబంధం. ఈ క్రమంలో ఒకరోజు ఆశా దేవి ఇంటికి సంపత్ వెళ్లాడు. అక్కడ సంపత్ తన వ్యాపార మిత్రులతో మద్యం సేవిస్తుండగా.. ఒక స్థలం గురించి గొడవ జరిగింది.
ఆ స్థలం ఆశా దేవి భర్త పేరు మీద ఉంది. దానిని సంపత్ మధ్యవర్తిగా ఉంటూ మరొకరికి విక్రయించి.. కమిషన్ తీసుకున్నాడు. కానీ ఆ రోజు మద్యం సేవిస్తూ ఆ స్థలం డాక్యుమెంట్లు నకిలీవని, ఆశాదేవి తన భర్తతో కలిసి తనను మోసం చేసిందని సంపత్కు తెలిసిపోయింది. దీంతో అతను గొడవ చేశాడు. అప్పుడు అతడిని ఆశాదేవి, ఆమె భర్త కలిసి కత్తులతో పొడిచి చంపేశారు. ఆ తరువాత ఎవరికీ తెలియకుండా శవాన్ని బెడ్రూం లో పాతిపెట్టారు. కానీ సంపత్ మొబైల్ ఫోన్ కాల్ రికార్డ్స్, చివరి లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆశాదేవిని అనుమానించి పట్టుకున్నారు.
పోలీసులు తమ పద్ధతిలో విచారణ చేయగా.. ఆశా దేవి జరిగినదంతా చెప్పింది. ఆ తరువాత పోలీసులు ఆ ఇంట్లో నుంచి సంపత్ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ఆశాదేవిని పోలీసులు హత్య కేసులో అరెస్టు చేశారు. ఆమె భర్త పరారీలో ఉన్నాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

