లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్లోని మరుగుదొడ్డిలో 20 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. మార్చి 19న ఈ ఘటన జరగ్గా ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
భర్తతో కలిసి రైలు కోసం మహిళ వేచిచూస్తుండగా ఈ ఘటన జరిగిందని కొల్వాలి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఆర్ఎన్ రాయ్ వెల్లడించారు. స్టేషన్లో యువతిని ఒంటరిగా విడిచి భర్త టీ తీసుకువచ్చేందుకు వెళ్లగా ఆమె వద్దకు వచ్చిన నిందితుడు ఆమెకు తాళం ఇచ్చి పార్కింగ్ స్టాండ్ సమీపంలోని మరుగుదొడ్డిని ఉచితంగా వాడుకోవచ్చని చెప్పాడు.
ఇక ఆమె టాయ్లెట్లోకి వెళ్లగా నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరానికి పాల్పడిన అనంతరం నిందితుడు అణ్ణా పరారయ్యాడు. భార్యను కాపాడిన భర్త పోలీసులకు సమాచారం అందించాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.