ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. వెయిట్రెస్‌గా పనిచేసే 26 ఏండ్ల మహిళపై కారులో నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బార్లో లేడీస్ ఆర్కెస్ట్రాలో వెయిట్రెస్‌గా పనిచేసే బాధితురాలు 2019 నుంచి గోవింద్ రాజ్‌భర్ అనే వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోంది. వివాహం చేసుకుంటానని నమ్మబలుకుతూ నల్లసపొర ప్రాంతానికి చెందిన రాజ్‌భర్ 2019 ఫిబ్రవరి నుంచి 2021 ఆగస్ట్ మధ్య బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆస్తి కొనుగోలు చేయాలంటూ తన వద్ద నుంచి పెద్దమొత్తంలో నగదు, ఆభరణాలు తీసుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అభ్యంతరకర వీడియోలూ చిత్రీకరించాడని ఆరోపించారు. చెన్న బ్రిడ్జి సమీపంలో నిందితుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్‌భర్ బాధితురాలు సోదరి స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆమెను కూడా బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపణలున్నాయి.