గువాహతి: రోడ్డు పక్కన పానీపూరి అమ్మే వ్యక్తి చేసిన ఈ పని చూస్తే మీరు అలాంటి చోట వాటిని తినరు. అస్సాం రాజధాని గువాహతిలోని అత్గావ్ ప్రాంతంలో పానీపూరి అమ్మే వ్యక్తి మగ్లో మూత్రం పోశాడు. దానిని పానీపూరి రసంలో కలిపాడు. ఒక వ్యక్తి తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు వెంటనే దీనిపై స్పందించారు. పానీపూరి అమ్మే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే అతడి వివరాలు మాత్రం పోలీసులు బయటపెట్టలేదు.
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతడు వ్యాపారం చేయకుండా చూడాలంటూ పలు కామెంట్లు పోస్ట్ చేశారు.
Shocking!A street vendor(pani puri saller) has been arrestd in Guwahati after viral a sensational video in which he mixed his urine with water and using the same Water in Pani Puri.#ViralVideo #Guwahati @ABPNews @ANI @the_viralvideos @ViralPosts5 @indiatvnews @TheQuint @SkyNews pic.twitter.com/ncekjhMeh1
— Mamun Khan (@Mk817Khan) August 20, 2021