అలీగఢ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లా రతవాలీ గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం సదరు ఇంటి తలుపులు తీయకపోవడం, ఎంత పిలిచినా స్పందించకపోవడం, ఫోన్లు చేసినా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా భార్య ఫ్లోర్‌పై విగతజీవిగా, భర్త ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. ముందుగా భార్యను గొంతు నులిమి చంపేసి, అనంతరం భర్త ఉరేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.