లక్నో : సంతానం లేని ప్రియురాలికి నెలరోజుల వయసున్న తన మనవరాలిని కానుకగా ఇచ్చిన వ్యక్తి(56)ని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని బిజ్నోర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. 40 ఏండ్ల పైబడిన వివాహితతో నిందితుడు సన్నిహితంగా ఉంటున్నాడు.
బేబీని దత్తత తీసుకోవాలనే తన కోరికను మహిళ వ్యక్తం చేయడంతో ఆమెకు బహుమతిగా ఇచ్చేందుకు నిందితుడు ఏకంగా నెలరోజుల వయసు కలిగిన తన కూతురి బిడ్డను కిడ్నాప్ చేయాలని నిర్ణయించాడు. తన కూతురు కనిపించడం లేదని శిశువు తండ్రి ఖాసిం అహ్మద్ ఏప్రిల్ 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.
దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అహ్మద్ మామ మహ్మద్ జాఫర్‌గా గుర్తించారు. మహిళ ఆమె భర్త వద్ద బిహార్‌లో ఉన్న శిశువును తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని బిజ్నోర్ ఎస్పీ ధరంవీర్ సింగ్ తెలిపారు.