శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 24, 2021 , 10:24:27

పటాన్‌చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం

పటాన్‌చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం

సంగారెడ్డి: జీహెచ్‌ఎంసీ శివార్లలో రక్షణ లేని ఏటీఎంలను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని బొంతపల్లి పారిశ్రామికవాడలోని యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు. శనివారం అర్ధరాత్రి ఏటీఎంలోకి వచ్చిన దుండగులు గ్యాస్‌ వెల్డింగ్‌ కట్టర్‌ సహాయంతో ఏటీఎం మిషన్‌ను కట్‌ చేయడానికి ప్రయత్నించారు. అయితే బయట అలజడి వినిపించడంతో వాటిని అక్కడే వదిలి పరారయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

VIDEOS

logo